

దాదాపు తొమ్మిది దశాబ్దాల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు—అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాపై తమకున్న అనుబంధం, అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల వెరైటీ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెరైటీ ఇండియా రెండో ఎడిషన్ కవర్‌పై ఈ ముగ్గురూ మెరిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన తండ్రి ఏఎన్నార్ సినిమానే శ్వాసగా భావించారని, ఆయన క్రమశిక్షణ, అంకితభావం తనను ఎంతో ప్రభావితం చేశాయని నాగార్జున తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి మాత్రమే కాకుండా కొత్త ప్రతిభకు వేదికగా నిలుస్తోందన్నారు. వారసత్వంతో వచ్చే ఒత్తిడి తనకు కూడా ఎదురైందని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి సమయం పట్టిందని చెప్పారు. అదే సమయంలో తన కుమారులు కూడా సాహసోపేతమైన కథలను ఎంచుకుని ప్రత్యేక గుర్తింపు సాధించాలని సూచించారు.
నాగచైతన్య, అఖిల్ తమ తండ్రి నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’ సినిమాను వందలసార్లు చూశామని గుర్తుచేసుకున్నారు. విజయాన్ని పునరావృతం చేయాలనే భయం కళాకారుడి సహజత్వాన్ని దెబ్బతీయకూడదని చైతన్య అభిప్రాయపడ్డారు. ఓటీటీలో భిన్నమైన పాత్రలు, కథలను అన్వేషించేందుకు ఆసక్తి ఉందని తెలిపారు. కుటుంబంలో వ్యక్తిగత జీవితం, సినిమాను వేరుగా ఉంచుకోవడం తమకు అలవాటని అఖిల్ చెప్పారు. మొత్తంగా సినిమా పట్ల ప్రేమ, క్రమశిక్షణ, మూలాలను మర్చిపోకపోవడమే నిజమైన అక్కినేని వారసత్వమని ముగ్గురూ చాటిచెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!