
జనరల్

ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతూ కీలక ఘట్టాలను పూర్తి చేసుకుంటోంది.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన టాకీ పార్ట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై ఈ షెడ్యూల్ కొనసాగుతోంది. అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!