

విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు భారీ ప్రమోషన్ బడ్జెట్లు, స్టార్ హీరోలు, ఇన్‌ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్లు అవసరమనే భావన ఉన్న రోజుల్లో ‘పర్ణశాల’ చిత్రబృందం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ప్రమోషన్‌కు ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. లక్ష్మీదేవితో ఈ పాటను పాడించిన టీమ్.. వినూత్న ప్రచార ఆలోచనతో పాటను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి, విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
భారీ పెయిడ్ ప్రమోషన్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్లకు బదులుగా క్రియేటివ్ ఐడియాతో పాటను జనాల్లోకి తీసుకెళ్లడం చిత్రబృందానికి ప్లస్‌గా మారింది. ఒక్క పాటతో సినిమాపై క్యూరియాసిటీ పెరగడంతో ‘పర్ణశాల’ మార్కెటింగ్ వ్యూహంపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ బజ్ థియేట్రికల్ బిజినెస్‌తో పాటు ఓటీటీ, ఆడియో హక్కులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వై.జి. భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!