
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి వారం లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం, ఈ ఏడాది సౌత్ ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘పెద్ది’ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రెండో వారం రన్ కొనసాగుతుండగా, లైఫ్‌టైమ్ కలెక్షన్లు ఎంతవరకు చేరుతాయో ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం కావడం విశేషం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!