
సినిమాలు

నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. విఐపి విరామ సమయంలో దర్శనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తన వారసుడిని ఘనంగా పరిచయం చేయడానికి బాలకృష్ణ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
“హనుమాన్” ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానుంది. స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ మోక్షజ్ఞ ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా ప్రారంభం వాయిదా పడింది. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో సినిమా ఉండనుందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!