
జనరల్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’పై అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది. తాజాగా చిత్రబృందం ‘అలా బోలేలో’ పాటను విడుదల చేసింది. ఈ పాటలో నటి పూర్ణ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. యాక్షన్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో మరోసారి రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!