

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, ట్రాన్స్ఫర్మేషన్కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి ఫిజికల్‌గా ఎంతో డిమాండ్ ఉన్న పాత్రకు న్యాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని గాయాలు కూడా కావడంతో పూర్తిగా కోలుకునేందుకు మూడు నెలల పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో కుటుంబంతో గడపడంతో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశముందని, దీంతో సుకుమార్‌తో చేయనున్న తదుపరి సినిమా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!