
క్రీడలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట విడుదలకు ముందే మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఈ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్ వేసినట్లు అభిమానులు లెక్కగట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ‘చికిరి చికిరి’ మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!