
గాసిప్స్

ఎంతో ఆసక్తిగా ‘రామాయణ’ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీలో ట్రైలర్ విడుదల చేయడం లేదని, మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ట్రైలర్ విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
మరోవైపు ‘రామాయణ’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రముఖ హాలీవుడ్ స్టూడియో సోనీ పిక్చర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. భారతీయ పురాణ గాథను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆలస్యమైనప్పటికీ, సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.













కామెంట్స్ (1)
❤️