
గాసిప్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆయన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేని ఫేక్ ప్రచారాలని ఆయన ఖండించారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని శరత్ చంద్ర నాయుడు తెలిపారు. ఆయన కెరీర్‌లో కీలక దశలో ఉన్నారని, పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయ్యారని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో సినిమాలతోనే బిజీగా ఉంటారని, మామయ్య ద్వారా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!