

ఇటీవల జరిగిన ఓ సినీ పరిశ్రమ కార్యక్రమంలో నటి సాయి పల్లవి ప్రసంగిస్తుండగా, నటుడు రణ్‌వీర్ సింగ్ ఆమెను శ్రద్ధగా వింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సినీ ప్రయాణం, ఇప్పటివరకు చేసిన సినిమాలు, ప్రతిభావంతులైన దర్శకులు, నటీనటులతో కలిసి పనిచేసే అవకాశాల గురించి సాయి పల్లవి కార్యక్రమంలో మాట్లాడారు.
సాయి పల్లవి స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో రణ్‌వీర్ సింగ్ ఆమె వైపు శ్రద్ధగా చూస్తూ, ఆమె చెప్పే విషయాలను ఆసక్తిగా వింటూ కనిపించారు. ఈ వీడియోకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ కావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే తాను చేసిన పని గురించి చెప్పడం కంటే, ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఆనందాన్ని ఇస్తుందని సాయి పల్లవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!