

లెజెండరీ నటుడు రియల్‌స్టార్ డా. శ్రీహరి ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన అడుగుజాడల్లోనే నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. లెల్లా రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లెల్లా రాహుల్ నిర్మిస్తున్నారు.

శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 15న తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ శ్రీహరి ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్‌లో తనయుడు మేఘాంశ్‌కు అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్ డా. శ్రీహరి కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. త్వరలో ఇండియాస్ బిగ్గెస్ట్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఈవెంట్ ద్వారా సినిమాలో హీరోకు సంబంధించిన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. మిగిలిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!