
రాజకీయాలు

30 కేంద్రాల్లో 100 రోజులు, 175 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమైన ఓ అందమైన యువతర ప్రేమకథ నువ్వు నేనుకు నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయని సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా సంగీతం ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తూ, అందమైన మనసుల మధ్య ప్రేమను చాటుతూనే ఉందని అన్నారు.
తనను నమ్మి అవకాశం ఇచ్చిన మెంటర్ తేజాకు ఆర్‌పీ పట్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘన విజయంలో గీత రచయిత కులశేఖర్ కూడా సమానంగా కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకుంటూ, తన భాగస్వామి కులశేఖర్‌ను ఎంతో మిస్ అవుతున్నానని భావోద్వేగంగా పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!