

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫేక్ అకౌంట్‌ను అసెంబ్లీలో సాక్ష్యంగా చూపించి చదవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన సంధ్యారావు పేరుతో బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరని, అంతర్జాతీయ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి అనే పదవి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. సంధ్యారావు పేరుతో కాంగ్రెస్ పార్టీయే ఫేక్ అకౌంట్‌ను నడుపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలను సమర్థించుకునేందుకే ఆ అకౌంట్‌ను సృష్టించారని విమర్శించారు.
ఫేక్ అకౌంట్‌ను ఆధారంగా చేసుకుని అసెంబ్లీని తప్పుదోవ పట్టించడం శాసనసభను అవమానించడమేనని హరీశ్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫేక్ అకౌంట్లపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. లేదంటే ముఖ్యమంత్రి వ్యవహారంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. కాగా, కేసీఆర్ ఫాంహౌస్ వద్ద జరిగిన నిరసనల నేపథ్యంలో దళితులు అక్కడికి వచ్చినందుకు బీఆర్‌ఎస్ నేతలు పసుపునీళ్లతో ప్రదేశాన్ని శుద్ధి చేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. దీనికి ఆధారంగా సంధ్యారావు ఎక్స్ ఖాతాలో చేసినట్లు పేర్కొన్న పోస్టు స్క్రీన్‌షాట్‌ను సభలో చూపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!