10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజా సేవే లక్ష్యంగా పనిచేద్దాం - చంద్రబాబు

Writer: Pooja 12:08 PM, 10 సెప్టెంబర్, 2026
ప్రజా సేవే లక్ష్యంగా పనిచేద్దాం - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అహంకారాలకు, ఈగోలకు తావులేకుండా ప్రజా సేవకులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకుని లక్ష్యాల సాధనకు ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని, సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్‌కు కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.

హంద్రీనీవా, వెలిగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నదుల అనుసంధానం ద్వారా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే దేశ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమయ్యాయని, ఇది మొత్తం బృందం విజయమని స్పష్టం చేశారు.

ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి పాలనను మరింత సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. చురుకైన పాలనతో ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందాలని సూచించారు. సాంకేతికత, డేటా ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి నిర్ణయాల్లో వేగం, సేవల్లో నాణ్యత పెంచాలని చెప్పారు. ఈ ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా నీటి భద్రత సవాలుగా మారిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రేణిగుంట–అరక్కోణం మార్గంలో అదనపు రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో రూ.1,157 కోట్లతో 46 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరగనుందని, దీనివల్ల తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట

బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్జిల్లా కలెక్టర్లుప్రజా సేవఅభివృద్ధిరైల్వే ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల
జనరల్

తెలంగాణలో కూరగాయల సాగు పెంచుతాం - తుమ్మల

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌
రాజకీయాలు

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక
జనరల్

ప్రియాంక ఫేక్ వీడియోలపై కీలక హెచ్చరిక

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!
సినిమాలు

ఒకే సీన్.. రెండు సినిమాలు.. ‘ఇరుముడి’ తర్వాత ‘హనుమాన్ అంశ్’కు అదే క్రేజ్!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

ప్రజా సేవే లక్ష్యంగా పనిచేద్దాం - చంద్రబాబు
జనరల్

ప్రజా సేవే లక్ష్యంగా పనిచేద్దాం - చంద్రబాబు

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్
రాజకీయాలు

ఫేక్ అకౌంట్‌పై విచారణకు హరీశ్ రావు డిమాండ్

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం
క్రీడలు

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌
బిజినెస్

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!