
రాజకీయాలు

బాహుబలి ఫేమ్ రమ్యకృష్ణ ఇప్పుడు రియాలిటీ షో హోస్ట్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న తమిళ డేటింగ్ షో ‘సెకండ్ లవ్’కి ఆమె హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బ్రేకప్ అయిన తర్వాత సెకండ్ లవ్ కోసం ప్రయత్నిస్తున్న 30 ఏళ్లలోపు 12 మంది సింగిల్స్‌ను ఒక విల్లాలో ఉంచి వారి మధ్య సంబంధాలను అన్వేషించేలా ఈ షో రూపొందించారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో రమ్యకృష్ణ యువతరానికి తగ్గ స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఇది తమిళంలో మాత్రమే ప్రకటించబడింది. అయితే తెలుగులో కూడా విడుదల అవుతుందా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఓటీటీ డేటింగ్ షోలకు పెరుగుతున్న క్రేజ్ మధ్య ఈ షోపై మంచి ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!