

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘హే బలవంత్’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ నటి శివానీ నాగరం ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న నటుడు అభిషన్ జీవింత్ సరసన ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. దీంతో శివానీ కెరీర్‌లో మరో కీలక అవకాశం దక్కినట్లైంది.
గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ. బాలమురుగన్ నిర్మిస్తున్నారు. మరో కథానాయికగా యోగలక్ష్మి నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షూటింగ్ వీడియోను పంచుకున్న శివానీ, తమిళంలో తొలి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. శివరాజ్‌కుమార్‌తో కలిసి నటించడం తన అదృష్టమని, ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!