

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 40 ఏళ్ల కలగా రూపుదిద్దుకున్న ‘సింగ్ గీతం’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గోల్డెన్ బ్లాక్బస్టర్ ఈవెంట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని హార్ట్ టచింగ్ అనుభూతిని కలిగించే సినిమాగా అభివర్ణిస్తూ, ప్రతి ఒక్కరూ థియేటర్లలో తప్పక చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘మహానటి’ తర్వాత ప్రేక్షకులు ఇంతగా తమదిగా భావించిన సినిమా ఇదేనని పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఇది తన కెరీర్లో అత్యంత సంతృప్తిని ఇచ్చిన సంగీత ప్రాజెక్ట్ అని అన్నారు. సింగీతం గారి విజన్, నాగ్ అశ్విన్ అంకితభావం, చిత్ర బృందం కృషి కలిసి ‘సింగ్ గీతం’ను ప్రత్యేక చిత్రంగా నిలబెట్టాయని పలువురు ప్రశంసించారు. ఈ చిత్రం కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!