
జనరల్

నందమూరి నటసింహం బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఓ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం కానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కొనసాగుతున్నాయని, అన్ని అంశాలు ఖరారైన తర్వాత త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
తేజస్విని ఎంట్రీ ఇవ్వనున్న చిత్రం సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా ప్రయోగాత్మకంగా, యువతకు స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ముందుగా హీరోగా పరిచయం అవుతారని భావించినప్పటికీ, తేజస్విని ముందుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలతో నందమూరి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!