28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

Writer: Shivani K 10:03 AM, 28 సెప్టెంబర్, 2026
‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

ఇటీవల ‘మండాడి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ నటుడు సూరి, ఇప్పుడు ‘సంచారి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూరి, మలయాళ స్టార్‌ నివిన్‌ పౌలి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 1న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘సప్తగిరులు సప్తసాగరాలు’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్‌. కలర్స్‌ అండ్‌ క్లాప్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత ఎం. సుబ్బారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, నటీనటుల అభినయం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ‘తంగ మీన్కల్‌’, ‘తారమణి’, ‘పెరంబు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్‌ ఈ సినిమాను తనదైన శైలిలో రూపొందించారు.

యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సూరి, నివిన్‌ పౌలి వంటి విలక్షణ నటులు, దర్శకుడు రామ్‌ శైలి, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం కలయికతో ‘సంచారి’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. వాస్తవానికి ఈ చిత్రం ‘ఏళు కడల్‌ ఏళు మలై’ పేరుతో తమిళంలో తెరకెక్కింది. ఇటీవల ‘మండాడి’ విజయంతో సూరికి తెలుగులో మంచి గుర్తింపు రావడంతో ఈ చిత్రాన్ని ‘సంచారి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు సుహాస్‌ కూడా కీలక పాత్రలో నటించారు. అక్టోబర్‌ 1న థియేటర్లలోకి రానున్న ‘సంచారి’ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

సాయి పల్లవిని చూసి సర్జరీ వద్దనుకున్నా : నివేదా పేతురాజ్

సాయి పల్లవిని చూసి సర్జరీ వద్దనుకున్నా : నివేదా పేతురాజ్

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..
ట్యాగ్లు
సంచారిసూరినివిన్ పౌలిఅంజలిదర్శకుడు రామ్యువన్ శంకర్ రాజామండాడిఏళు కడల్ ఏళు మలైతెలుగు సినిమాతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!
సినిమాలు

ది ప్యారడైజ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు.. ఎందుకంటే!

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!
సినిమాలు

ఫేక్ ఎక్స్ ఖాతాపై దుల్కర్ సల్మాన్ హెచ్చరిక!

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!
టెక్నాలజీ

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?
సినిమాలు

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక
బిజినెస్

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం
టెక్నాలజీ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?