

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘హైడ్ అండ్ సిల్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సంజనా కృష్ణమూర్తి కథానాయికగా నటిస్తోంది. కార్తికేయన్ సంతానం, వార్తికా జైన్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. “కొన్ని ప్రేమకథలు రాసినవి కావు.. అల్లినవి” అనే క్యాప్షన్ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఓ వినూత్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. సుహాస్ నటనతో పాటు దర్శకుడు రాజేంద్ర బాల కొత్త తరహా కథనశైలి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. టైటిల్, ప్రోమోతో అంచనాలు పెంచుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!