

పండుగ సీజన్లలో భారీ బడ్జెట్ చిత్రాల మధ్య విడుదలైన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ఈ దీపావళికి కూడా స్టార్ కాస్ట్‌తో వస్తున్న పలు చిత్రాలు బాక్సాఫీస్ రేసులో ఉండగా, ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. సినిమాపై వారు ఎంతో నమ్మకంగా ఉండటంతో పాటు, సినీ వర్గాల నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నట్లు సమాచారం.
జి. శ్రీకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాల నటులు రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటి జయసుధ, వాసుకి ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నోస్టాల్జిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. శింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించగా, ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి సందర్భంగా భారీ చిత్రాల మధ్య ‘సమ్మర్ హాలిడేస్’ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!