

దక్షిణాది సినీ పరిశ్రమలో మరోసారి ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రాలు ఒకే సమయంలో విడుదలై సినీ వర్గాల్లో భారీ చర్చకు దారితీశాయి. ఆ పోటీలో జైలర్ ఘన విజయాన్ని అందుకోగా, భోళా శంకర్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.
ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు అగ్రనటుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం జైలర్–2 అక్టోబర్ 15న విడుదల కానుండగా, చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేర్వేరు జానర్లలో తెరకెక్కుతున్న ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత పోటీ ఫలితాన్ని ఈసారి చిరంజీవి మార్చగలరా? లేక మరోసారి రజనీకాంత్ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా? అనే చర్చ ఇప్పటికే సినీ వర్గాలు, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!