

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కుటుంబ కథా చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ మరియు 20 ఏళ్ల యువతి మధ్య సాగే విభిన్న ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
చిత్ర సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సిద్ధం చేస్తుండగా, మమితా బైజు రికార్డింగ్‌కు వస్తుందని చూపించారు. అయితే పాట పాడకుండా ఆమె నృత్యం చేయడం వీడియోలో సరదా వాతావరణాన్ని సృష్టించింది. ఈ గందరగోళం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. చిత్ర తొలి పాట ప్రచార వీడియో ఈ నెల 17న విడుదల కానుండగా, పూర్తి పాట విడుదల తేదీని మాత్రం చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!