
జనరల్

దక్షిణ భారత స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌లో సూర్య నటించనున్నట్లు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సూర్యకు సంస్థ ఘన స్వాగతం పలికింది.
"తన తరం అత్యంత నిర్భయ నటుడు ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత గొప్ప వేదికపై అడుగుపెడుతున్నారు" అంటూ హోంబలే ఫిల్మ్స్ పేర్కొంది. "సూర్య × హోంబలే" పేరుతో విడుదలైన ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన దర్శకుడు, కథ, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!