
సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, దర్శకుడు పీ.ఎస్. మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ధనుష్ సరసన నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌తో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న మైథాలజికల్ జంగిల్ అడ్వెంచర్ ఎపిక్‌లో కరీనా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటివరకు ఆమె అధికారికంగా ఒప్పందంపై సంతకం చేయలేదు. చర్చలు సానుకూలంగా జరిగితే తొలిసారి ధనుష్-కరీనా జోడీ తెరపై కనిపించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!