

విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ మరియు ఐశ్వర్య మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన అభిషేక్ నామ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం థియేట్రికల్ హక్కుల విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ క్రమంలో చిత్ర నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నైజాం ప్రాంతంలో దిల్ రాజుకు ఉన్న బలమైన పంపిణీ వ్యవస్థ కారణంగా సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. జునైద్ కుమార్, అభే సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!