

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ది ప్యారడైజ్. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నాని కెరీర్‌లోనే సాలిడ్ ఓపెనింగ్స్‌ను అందుకుని వార్తల్లో నిలిచింది. తెలుగు నుంచి ఈ ఏడాదిలో బలమైన ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ నైజాం మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను నమోదు చేస్తోంది.
పీఆర్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజే నైజాంలో రూ.13 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు వర్కింగ్ డే కావడంతో పాటు గణేష్ నిమజ్జనం వంటి భారీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ది ప్యారడైజ్ వసూళ్లలో జోరు కొనసాగించింది. రెండో రోజు రూ.5 కోట్లకు పైగా షేర్ సాధించినట్లు సమాచారం. దీంతో నైజాంలో సినిమా మొత్తం షేర్ రూ.18 కోట్ల మార్కును దాటినట్లు తెలుస్తోంది. ఇక వారాంతంలో వసూళ్లు మరింత పెరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!