
సినిమాలు

‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏమాత్రం విరామం లేకుండా తన 64వ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన ఆయన, ఈసారి సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
యువ దర్శకుడు హసిత్ గోలి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకునే హసిత్ గోలి, రవితేజతో కలిసి సరికొత్త కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో పాటు రిఫ్రెషింగ్ కథనం, వినోదం, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!