

ఇండియన్ సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలు చాలా అరుదు. 1990లో బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కలయికలో వచ్చిన ‘ఆదిత్య 369’ అప్పట్లోనే వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలాలను కలిపి చూపించింది. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లోనూ ఇదే తరహా టైమ్ ట్రావెల్ అంశం ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే కథ కేవలం గతం, వర్తమానం మధ్య మాత్రమే సాగదని, భవిష్యత్ కాలానికి కూడా ప్రయాణిస్తుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 2070 లేదా ఆ తర్వాతి కాలానికి సంబంధించిన సన్నివేశాలు కూడా సినిమాలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ‘వారణాసి’ మూడు కాలమానాలను కలిపే కథగా ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!