

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ, ఆ తర్వాత ‘గుణ 369’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’, ‘బెదురులంక 2012’ వంటి విభిన్న చిత్రాల్లో నటించాడు. 2024లో విడుదలైన ‘భజే వాయు వేగం’ తర్వాత ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విరామ సమయంలో కార్తికేయ తన సొంత కథపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కార్తికేయ నిర్ణయించుకున్నాడు. తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను కార్తికేయ ఎలా నిర్వహించనున్నాడనే దానిపై ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!