

‘కేజీఎఫ్’ తర్వాత యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 26న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి సినిమాలో బోల్డ్ కంటెంట్, యాక్షన్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం.
దర్శకురాలిగా గీతూ మోహన్‌దాస్‌కు ఇది మూడో ఫీచర్ ఫిల్మ్. అయితే ఆమెకు నటిగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. మోహన్‌లాల్ నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో హీరోయిన్‌గా పరిచయమైన గీతూ.. తమిళంలో ‘నల దమయంతి’తో పాటు కె. బాలచందర్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నటించిన ‘పోయి’లో సెకండ్ హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఈ చిత్రం ‘అబద్ధం’ పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం నటనకు దూరమైన గీతూ.. దర్శకత్వంపై దృష్టి సారించారు. ఇప్పుడు ‘టాక్సిక్’తో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!