
జనరల్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమ బ్యానర్‌లో విడుదలైన సినిమాను త్రివిక్రమ్‌కు చూపించామని, ఆయనకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాగా నచ్చిందని తెలిపారు. తమ బ్యానర్‌లో త్రివిక్రమ్‌కు నచ్చిన సినిమాలు ఇప్పటివరకు ఫెయిల్ కాలేదని, అందువల్ల ఈ సినిమాపై కూడా పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో ఆగస్టు 14న తేలనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!