

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘దసరా’ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా సినిమాలోని కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేసీఆర్ పాత్రను చూసేందుకు ఆయన అభిమానులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా థియేటర్‌కు వెళ్లి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన సినిమా గురించి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. “అస్తిత్వం కోసం ఆరాటం.. అణిచివేతపై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి” అనే సందేశాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కథానాయకుడి పాత్రలో జీవించిన నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ, ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే సినిమాలోని కేసీఆర్ డైలాగ్ “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా” అంటూ కేటీఆర్ ప్రస్తావించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినిమాను వీక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!