
సినిమాలు

విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దం బ్రిటీష్ పాలన కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ సినిమా 100 రోజుల షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. అలాగే టాకీ పార్ట్‌లో 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇటీవల గండికోటలో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో కూడా నటిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!