

విజయ్ సేతుపతి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘ట్రైన్’, ‘స్లమ్ డాగ్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో హీరోగా నటిస్తూనే, మరోవైపు ‘అరసన్’, ‘జైలర్ 2’ చిత్రాల్లో అతిథి పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆయన, తన కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో మంచి కథలు, పాత్రల కోసం అతిథి పాత్రలు చేసినప్పటికీ, ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయానికి కారణం వివరించిన ఆయన, ‘జైలర్ 2’లో మాత్రం రజినీకాంత్ కోసం మాత్రమే మినహాయింపు ఇచ్చానన్నారు. ఇతర సినిమాల్లో అతిథి పాత్రలు చేసినప్పుడు ప్రచారంలో తనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తన ప్రధాన హీరో ప్రాజెక్ట్‌లపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే భవిష్యత్తులో అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!