

తమిళ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలు, కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని సూర్య విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, సినిమా చూసేంతసేపూ ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు ఉంటుందని అన్నారు. ఇది సూర్య అభిమానుల కోసం మాత్రమే కాకుండా వారి కుటుంబాల కోసం రూపొందించిన సినిమా అని తెలిపారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని నిర్మాత నాగవంశీ అన్నారు. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్ తదితరులు కూడా చిత్రంపై నమ్మకం వ్యక్తం చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!