

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో మూడో వారం నామినేషన్లు, ఎలిమినేషన్ చుట్టూ జరుగుతున్న ప్రచారంతో డ్రామా, మైండ్ గేమ్స్ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్లు అపూర్వ, మిథిలేష్ ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌లో కొత్త ట్విస్ట్ మొదలైంది. సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం టెంపర్ వంశీ ప్రస్తుతం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాస్కుల్లో దూకుడుగా వ్యవహరించడం, తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడం ఆయనకు మంచి స్క్రీన్ స్పేస్ తెచ్చిపెట్టినప్పటికీ, మాట తీరు కొంతమంది ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ కూడా ఈ వారం బాటమ్ రేసులో ఉన్నట్లు సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి. కెప్టెన్సీ దక్కిన వెంటనే నామినేషన్లలోకి రావడం, ఓటింగ్‌లో వెనుకబడినట్లు ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ట్రెండ్స్ నిజమై వంశీ ఈ వారాంతంలో ఎలిమినేట్ అయితే, అది హౌస్ సభ్యులకు ఊహించని షాక్‌గా మారే అవకాశం ఉంది. అయితే అధికారిక ఓటింగ్ ఫలితాలు, ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎలిమినేషన్‌పై స్పష్టత రాదు.
అపూర్వ, మిథిలేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో మరింత ఉత్కంఠ నెలకొంది. కామనర్ కంటెస్టెంట్ల మధ్య ఉన్న విభేదాలు, ఒకరిపై ఒకరికి ఉన్న అసంతృప్తిని వీరిద్దరూ ప్రస్తావించడంతో గ్రూప్‌లో కొత్త అనుమానాలు మొదలైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల భయం, ఎలిమినేషన్ ఉత్కంఠ, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వారాంతంలో నాగార్జున ఎలాంటి స్పందన ఇస్తారు, చివరకు ఓటింగ్ ట్రెండ్స్ మారతాయా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!