

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్‌పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ అంశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో విడుదల క్యాలెండర్ బిజీగా ఉండటంతో సరైన సమయాన్ని ఎంపిక చేయడంపై మేకర్స్ దృష్టి పెట్టినట్లు సమాచారం. పండుగ సీజన్లో విడుదల చేసే అవకాశాలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!