

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాలో ‘అత్తింధోం’ పాటలో కనిపించిన చిన్నారి ప్రహర్షిత శ్రీనివాసన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సమయంలో ముద్దుగా, బొద్దుగా కనిపించిన ఈ చిన్నారి తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తమిళ సినిమాలు, సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన ప్రహర్షిత, ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది.
అయితే ‘చంద్రముఖి’ తర్వాత దాదాపు 18 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత, తన చదువుపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె మళ్లీ బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తోంది. అప్పటి చిన్నారి ఇప్పుడు గ్లామర్ లుక్‌తో హీరోయిన్లను సైతం మించిన అందంతో ఆకట్టుకుంటోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమె వివాహం కూడా జరిగినట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!