

నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్ ‘యేష నాగుల’ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తూ.. విడుదలైన 17 రోజుల్లోనే ఒకే భాషలో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్టు 29న విడుదలైన ఈ పాటలో నాని, కీర్తి సురేశ్ సందడి చేశారు. దీంతో ఒకే భాషలో 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న టాలీవుడ్ పాటగా ‘యశనగుల’ నిలిచినట్లు సమాచారం. ఈ రికార్డుతో నాని అభిమానులు, సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు.
గతంలో ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావా’, ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటలు ఈ విభాగంలో రికార్డులు సాధించాయి. తాజాగా ‘యశనగుల’ వాటిని అధిగమించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘ది ప్యారడైజ్’ను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్‌బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!