

యశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల సమయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7:01 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ యష్ పవర్ఫుల్ లుక్‌తో కూడిన పేలుడు పోస్టర్‌ను విడుదల చేసింది.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’లో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ విడుదలకు సమయం ఖరారు కావడంతో యష్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ట్రైలర్లో యష్ పాత్రను, యాక్షన్ ప్రపంచాన్ని, గ్యాంగ్‌స్టర్ నేపథ్యాన్ని ఎలా చూపించారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!