

మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం 3’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ విడుదలకు చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ‘దృశ్యం’ ఫ్రాంచైజీ తెలుగు హక్కులు తమకే చెందినవని పేర్కొంటూ దర్శకురాలు శ్రీప్రియ, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. మూడో భాగాన్ని డబ్బింగ్ రూపంలో విడుదల చేయడం తమ హక్కులకు విరుద్ధమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.
వాదనలు పరిశీలించిన మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణ వరకు ‘దృశ్యం 3’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఓటీటీ వేదికల్లో విడుదల చేయరాదని మధ్యంతర స్టే విధించింది. ఈ కేసులో ఆశీర్వాద్ సినిమాస్, దర్శకుడు జీతూ జోసెఫ్, పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ ప్రతివాదులుగా ఉన్నారు. వివాదం పరిష్కారం అయ్యే వరకు తెలుగు హక్కులకు సంబంధించిన ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేయవద్దని రాజ్‌కుమార్ థియేటర్స్ ఇండస్ట్రీ వర్గాలకు హెచ్చరిక జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!