

శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన కొత్త తెలుగు చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, రాజేంద్ర ప్రసాద్ వేంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందని ఈ సినిమా నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
ఈ కథ వెంకటరమణ అనే మధ్యతరగతి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, రోజువారీ సమస్యలతో సతమతమయ్యే రమణకు ఓ రోజు సాక్షాత్తూ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఓ ప్రత్యేకమైన పుస్తకాన్ని అందిస్తాడు. ఆ పుస్తకంలో ఏది రాస్తే అది నిజమవుతుందని తెలుసుకున్న రమణ తొలుత తన కోరికలను నెరవేర్చుకునేందుకు దాన్ని ఉపయోగిస్తాడు. అయితే కోరికలు తీరుతున్న కొద్దీ అతనిలో ఆశ పెరుగుతుంది. చివరకు ఆ పుస్తకాన్ని నమ్ముకుని తీసుకున్న నిర్ణయాలు అతని జీవితంలో, కుటుంబంలో ఎలాంటి సమస్యలకు దారితీశాయి? ఆ పుస్తకం వెనుక ఉన్న అసలు నియమం ఏమిటి? అనేదే మిగతా కథ.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!