

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న యానిమేటెడ్ ఫాంటసీ సిరీస్ ‘ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా’ సీజన్ 4 మరింత ఉత్కంఠభరితంగా మారబోతోంది. జూన్ 17 నుంచి ఎపిసోడ్లు 7 నుంచి 9 వరకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ కొత్త ఎపిసోడ్లలో భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, కథను మలుపుతిప్పే కీలక పరిణామాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫాంటసీ, అడ్వెంచర్, హ్యూమర్ మేళవింపుతో ఈ సిరీస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.
భారతీయ ప్రేక్షకులు ఈ ఎపిసోడ్లను ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ సిరీస్ ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో పాటు సబ్‌టైటిల్స్‌లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ ఫినాలే దిశగా కథ సాగుతుండటంతో మ్యాజికల్ యుద్ధాలు, కీలక రహస్యాలు, ఉత్కంఠభరితమైన పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!