

‘షాక్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రిపోర్టింగ్ లైవ్’ పేరుతో రూపొందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు ధృవ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పరిణీతి చోప్రా జర్నలిస్టుగా, దేవెన్ భోజాని అనుభవజ్ఞుడైన కెమెరామెన్‌గా కనిపించనున్నారు. మిహిర్ జాదవ్ కథ అందించిన ఈ చిత్రంలో అమోల్ పాలేకర్, ఆదిల్ హుస్సేన్, శేఖర్ సుమన్, శాశ్వత ఛటర్జీ, నాసర్, ప్రాచీ షా పాండ్యా, గీతా అగర్వాల్, సమీర్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పార్థ కిరణ్ ఠాకూర్, జోషువా షిర్సత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఓ కీలక ఆధారాన్ని అనుసరించే జర్నలిస్టు, కెమెరామెన్ చుట్టూ సాగుతుంది. నిజం బయటకు రాకూడదని భావించే ఇసుక మాఫియా వారి వెంట పడటంతో దర్యాప్తు మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుండగా, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ‘కొన్ని కథలు పూడ్చిపెట్టబడటానికి నిరాకరిస్తాయి’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!