
క్రీడలు

కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వందేమాతరం వివాదం నేపథ్యంలో దేశ ప్రజలను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశభక్తికి ప్రతీకగా భావించే వందేమాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.
వందేమాతరం పూర్తి గీతం ఆలాపనపై కొనసాగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశ జాతీయ గీతాలు, జాతీయ చిహ్నాల పట్ల గౌరవంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి స్పష్టమైన వివరణ రావడంతో పాటు, వివాదానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!