31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

Writer: Chandrika 08:41 PM, 31 ఆగస్టు, 2026
బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

బీజేపీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడులకు ప్రయత్నించడం పిరికిపంద చర్య అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిర్వహించిన ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు, యువత తరలివచ్చి మద్దతు తెలిపారని ఆయన అన్నారు. యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై నల్లరంగు చల్లడం, పార్టీ నాయకుల నివాసాలను ముట్టడించేందుకు ప్రయత్నించడం, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై దాడులకు కుట్ర చేయడం వంటి చర్యలు కాంగ్రెస్‌ అనుబంధ విభాగాలైన ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ తీరుకు నిదర్శనమని విమర్శించారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరని, అయితే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని రామచందర్‌రావు అన్నారు. బీజేపీ ప్రస్తుతం సంయమనం పాటిస్తోందని, దాడులు కొనసాగితే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగబద్ధ పదవుల్లో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసిన సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్‌’ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండల స్థాయిలో మొక్కలు నాటడం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
బీజేపీ తెలంగాణఎన్ రామచందర్‌రావుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్బీజేపీ కార్యాలయంరాజకీయ ఘర్షణఎన్‌ఎస్‌యూఐయూత్ కాంగ్రెస్విద్యార్థుల సమస్యలుఫీజు రీయింబర్స్‌మెంట్సేవా సంకల్ప అభియాన్నరేంద్ర మోదీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల యత్నం పిరికిపంద చర్య: ఎన్. రామచందర్‌రావు

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌
షోస్

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..
జనరల్

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..
సినిమాలు

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...
రాజకీయాలు

విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రుల షాక్‌...

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు
రాజకీయాలు

నల్లగొండలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులు

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..
జనరల్

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...
జనరల్

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!