
టెక్నాలజీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 4399 రోజులు పూర్తి చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జవహర్లాల్ నెహ్రు రికార్డును అధిగమించడం దేశానికి గర్వకారణమని అన్నారు. నెహ్రు కాలంలో అవినీతి, అరాచకాలు ఎక్కువగా ఉండేవని విమర్శిస్తూ, మోడీ పాలనలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు.
మోడీ నాయకత్వంలో దేశంలో సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు. 2047 వరకు మోడీ ప్రధానమంత్రిగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశమని పేర్కొంటూ, దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!