

చైనా ప్రభుత్వం అమెరికాకు చెందిన 10 రక్షణ రంగ సంస్థలపై ఆంక్షలు విధించింది. ఈ సంస్థలకు పౌర-సైనిక వినియోగ వస్తువుల ఎగుమతులను నిషేధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది. ఆంక్షలకు గురైన సంస్థల్లో రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ రక్షణ సంస్థలు ఉన్నాయి. ఇటీవల అమెరికా తమ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో కొన్ని చైనా టెక్ కంపెనీలను నిషేధించిన నేపథ్యంలో చైనా ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా అమెరికాకు చెందిన 46 కంపెనీల ఉత్పత్తులను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలు చైనా నుంచి కొనుగోలు చేసిన వస్తువులను ఆంక్షలకు గురైన అమెరికా సంస్థలకు బదిలీ చేయడాన్ని కూడా నిషేధించింది. ఇటీవల అలీబాబా, బైడూ వంటి చైనా టెక్ సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!